జెటాలో మాస్టర్‌కార్డ్ పెట్టుబడి
ముంబైకి చెందిన కంపెనీ జెటాలోమాస్టర్‌కార్డ్ పెట్టుబడి పెట్టింది. పెట్టుబడి ఎంతో రెండు కంపెనీలు వెల్లడించలేదు. వచ్చే అయిదేళ్ళలో అంతర్జాతీయంగా క్రెడిట్ కార్డులు ప్రారంభిస్తామని రెండు కంపెనీలు ప్రకటించాయి. జెటా కంపెనీని రాంకి గడ్డపాటి, భావిన్ తుకారియాలు 2015లో నెలకొల్పారు. డెబిట్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన ప్రాసెసింగ్ టెక్నాలజీని ఈ కంపెనీ అందిస్తోంది.ఇటీవలే ఈ కంపెనీ యూనికార్న్‌గా మారింది. అంతర్జాతీయంగా బ్యాంకులు,ఫిన్‌టెక్‌లకు తన ఉత్పత్తులను ఈ కంపెనీ విక్రయిస్తోంది.