130 డాలర్లు దాటిన ఆయిల్
రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ వంటి వర్ధమాన దేశాలు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. చమురు దిగుమతి ప్రధాన దేశాలు క్రూడ్ ఆయిల్ దూకుడుతో హడలెత్తి పోతుపోన్నాయి. రష్యా ఆయిల్‌పై నిషేధం విధించాలని అమెరికా, యూరప్ దేశాలు ప్రతిపాదించడంతో బ్యారల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 130 డాలర్లను దాటింది. ఆయిల్ 200 డాలర్లకు చేరినా ఆశ్చర్య పోనక్కర్లేదని బ్యాంక్ ఆఫ్ అమెరికా హెచ్చరించింది. ఇపుడు స్వల్పంగా తగ్గి ఇపుడు 126.8 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. రష్యా చమురును నిషేధించ అంశంపై ఇప్పటికే యూరపియన్ దేశాలతో చర్చలు ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు అణు ఆంక్షలు ఎత్తివేతపై ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. దీంతో ఆయిల్ ధరలకు అడ్డులేకుండా పోతోంది. వెంటనే చమురు పెంచడం కష్టమని ఒపెక్ తేల్చడంతో స్పాట్ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. అధిక ధరల సమయంలోనూ చైనా క్రూడ్‌ను నిల్వ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. చైనా ముందు జాగ్రత్త ఇపుడు కాపాడుతోంది.