లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో బూమ్
ఈ ఏడాది లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో బూమ్ వస్తుందని రియల్ ఎస్టేట్ వర్గాలు అంటున్నాయి. అధిక నెట్‌వర్త్ వ్యక్తులు (HNI) ఈ మార్కెట్ ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాది ఈ మార్కెట్లో బూమ్ ప్రారంభమైందని… ఒమిక్రాన్ కారణంగా కాస్త తగ్గినా.. మళ్ళీ పుంజుకుంటుందని సాయా హోమ్ కంపెనీ సేల్స్ డైరెక్టర్ విపిన్ మోడీ అంటున్నారు. ఆఫీస్‌తోపాటు వర్క్ ఫ్రండ్ హోమ్ కూడా కొనసాగుతుండటం వల్ల HNIలు విలాసవంతమైన ఇళ్ళ పట్ల మొగ్గు చూపుతున్నారని చెప్పారు. అలాగే విలాసవంతమైన జీవితం, సమాజం స్థాయిని కోరుకునే వారు కూడా ఈ మార్కెట్ పట్ల ఆకర్షితులౌతున్నారు. ఇటీవల ఓ అంతర్జాతీయ రియల సంస్థ ద లగ్జరీ హౌసింగ్ ఔట్లుక్ ఓ నివేదిక విడుదల చేసిందని, దీని ప్రాకారం HNIలలో 67 శాతం మంది లగ్జరీ హౌసింగ్‌పై ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొందని విపుల్ మోడీ అన్నారు. దాదాపు 76 శాతం మంది ఆస్తులపై పెట్టుబడి పట్ల ఆసక్తి చూపకగా, వారిలో 89 శాతం మంది రియల్ ఎస్టేట్ ఆస్తులు కొనేందుకు ఆసక్తితో ఉన్నట్లు చెప్పారు.11 మంది మాత్రమే కమర్షియల్ ప్రాపర్టీ కొనేందుకు ఆ సర్వేలో ఆసక్తి చూపారు. మిగులు ఆదాయం పెరగడం, వడ్డీ రేట్లు తగ్గడం వల్ల చాలా మంఇ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నారు. చాలా మంది HNIలో రెండో ఇంటిని కూడా కొనడానికి ఇష్టపడుతున్నారని సర్వేలో తేలింది. రెసిడెన్షియల్ సెగ్మెంట్లో పెట్టుబడికి ఇది సరైన సమయని 31 శాతం మంది HNIలు అభిప్రాయపడుతున్నారు. గత 18 నెలల నుంచి రియల్ ఎస్టేట్ ధరలు స్తబ్దుగా ఉన్నా… ఈ ఏడాది ద్వితీయార్థంలో పెరుగుతాయని భావిస్తున్నారు.