జియో వరల్డ్ సెంటర్ ప్రారంభం
రిలయన్స్ ఇండస్ట్రీస్ ముంబైలో నెలకొల్పిన జియో వరల్డ్ సెంటర్‌ను ఆ సంస్థ డైరెక్టర్ నీతా అంబానీ ప్రారంభించారు. బాంద్రాకుంద్రా ఏరియాలోని 18.5 ఎకరాల్లోవిస్తరించిన ఈ సెంటర్ వ్యాపార, వాణిజ్య, సాంస్కృతిక డెస్టినేషన్‌గా ఈ కేంద్రం మన దేశానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇందులోని కన్వెన్షన్ సెంటర్ దేశంలోనే అతి పెద్దదిగా నిలవనుంది. 5జీ నెట్‌వర్క్ ఆధారిత కన్వెన్షన్ సెంటర్‌లో 1.61 లక్షల చ.అ. పైగా విస్తీర్ణం ఉండే మూడు ఎగ్జిబిషన్ హాల్స్, 1.07 లక్షల చ.అ. విస్తీర్ణం ఉండే రెండు కన్వెన్షన్ హాల్స్ ఉంటాయి. వచ్చే ఏడాదిలోగా దశలవారీగా ఇందులోని వివిధ విభాగాలను సంస్థ ఆవిష్కరించనుంది. అలాగే ధీరూభాయ్ అంబానీ స్క్వేర్, ఫౌంటెన్ ఆఫ్‌జాయ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు.