ఎల్‌ఐసీ ఐపీఓ వాయిదా?
రష్యా, ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితి ఇలాగే ఉంటే ఎల్‌ఐసీ ఐపీఓ షెడ్యూల్ ప్రకారం సాగేలా లేదు. మార్కెట్ పరిస్థితి బాగా లేదని, ఇలాంటి సమయంలో ఇంత పెద్ద ఇష్యూకు ఆదరణ కష్టమని ఎల్‌ఐసీ ఇష్యూకు మేనేజర్లుగా వ్యవహరిస్తున్న సంస్థలు అంటున్నాయి. రోడ్ షోలు పూర్తి చేసిన తరవాత యాంకర్ ఇన్వెస్టర్లతో చర్చలు జరపగా… సానుకూల సంకేతాలు రాలేదని తెలుస్తోంది. ఇష్యూను వాయిదా వేయాలని బ్యాంకర్లు, అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి రేపు లేదా ఎల్లుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఇపుడున్న పరిస్థితి సద్దుమణిగితే వచ్చే నెలలో అంటే ఏప్రిల్ ఆఫర్ ఉంటుందని అధికారులు అంటున్నారు. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఉండదన్నమాట. ఈ ఆర్థిక సంవత్సరంలో రాకపోతే బడ్జెట్ అంచనాలు తప్పినట్లే.