నిఫ్టికి తప్పని నష్టాలు

వీక్లీ డెరివేటివ్స్ ఒక మోస్తరు నష్టాలతో ముగిసింది. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టిని షార్ట్ చేసినవారికి భారీ లాభాలు వచ్చాయి. కాని వీక్లీ డెరివేటివ్స్ కొన్నవారి బ్యాంక్ నిఫ్టికి భారీ నష్టాలు మిగిల్చింది. నిన్న భారీ నష్టాలతో ముగిసిన బ్యాంక్ నిఫ్టి ఇవాళ లాభాలతో ముగస్తుందని భావించారు. కాని ఆరంభం లాభాన్ని తొందరగానే కరిగి పోయాయి. నిఫ్టి ఉదయం 16768ని తాకినా… క్రమంగా బలహీనపడుతూ మిడ్సెష్ సమయానికి నష్టాల్లోకి జారుకుంది. మిడ్ సెషన్లో ప్రారంభమైన యూరో మార్కెట్లు కూడా నష్టాల్లో ఉండటం కడా ఒక కారణం. పెరిగి ప్రతిసారి రెట్టించిన అమ్మకాల ఒత్తిడి వచ్చింది. దీంతో నిఫ్టి, బ్యాంక్ నిఫ్టి కోలుకోలేకపోయాయి. నిఫ్టి 108 పాయింట్ల నష్టంతో 16,498 పాయింట్ల వద్ద ముగిసింది. అన్ని సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టి నెక్ట్స్ మాత్రం చాలా స్వల్ప నష్టంతో ముగిసింది. మిడ్‌క్యాప్ నిఫ్టి, బ్యాంక్ నిఫ్టి ఒకశాతంపైగా నష్టంతో క్లోజ్ కాగా, నిఫ్టి మాత్రం 0.65 శాతం నష్టంతో ముగిసింది.