CSDLలో డీమ్యాట్ ఖాతాలు 6 కోట్లు!
CSDLలో యాక్టివ్ డీమ్యాట్ ఖాతాల సంఖ్య 6 కోట్ల మైలురాయిని దాటిందని సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ ఇండియా (సీడీఎస్ఎల్) వెల్లడించింది. 1999లో సీడీఎస్ఎల్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. షేర్లతో పాటు ఇతర సాధానాలను ఎలక్ట్రానిక్ రూపంలో డీ – మ్యాట్ ఖాతాల్లో భద్రపర్చడంతో పాటు ట్రేడింగ్ లావాదేవీల అనంతరం వాటిని సెటిల్మెంట్ చేయడం వంటి కార్యకలాపాలను సీడీఎస్ఎల్ నిర్వహిస్తోంది. పెద్ద నగరాలే కాకుండా మధ్య, చిన్న తరహా పట్టణాల నుంచి కూడా కొత్త డీ – మ్యాట్ ఖాతాలు నమోదుకావడం.. భారత సెక్యూరిటీస్ మార్కెట్ల విస్తరణను సూచిస్తున్నాయని సీడీఎస్ఎల్ చైర్మన్ బి.వి. చౌబల్ తెలిపారు. భారత సెక్యూరిటీ మార్కెట్లలో డీమ్యాట్ ఖాతాలు బాగా పెరిగినందున, మదుపర్లకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని సెబీ పూర్తి కాల సభ్యుడు అనంత బారువా అన్నారు. సీఎస్‌డీఎల్‌తో పాటు ఎన్‌ఎస్‌డీఎల్ కూడా ఇదే తరహా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.