క్రూడ్ ఆయిల్ @107.88
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర కావడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఒకవైపు 150 కోట్ల వ్యూహాత్మక చమురు నిల్వల నుంచి రోజుకు 6 కోట్ల బ్యారెళ్ళ చమురును విడుదల చేయాలని ఇంటర్నేషనల్ ఎనర్జి ఏజెన్సీ నిర్ణయించినా క్రూడ్ ధరలు చల్లబడటం లేదు.పైగా డాలర్‌తో పాటు చమురు ధరలు పెరగడంతో భారత్ వంటి దేశాలు డబుల్ ట్రబుల్ మొదైలంది. మొన్నటి దాకా 96 ప్రాంతంలో ఉన్న డాలర్ ఇండెక్స్ ఇవాళ ఏకంగా 97.37కు చేరింది. దీంతో చమురు భారం భారీగా పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఆసియా దేశాలు కొనే బ్రెంట్ క్రూడ్ ధర 107.88 డాలర్లకు చేరింది. 2014 తరవాత ఇదే అత్యధిక ధర. అమెరికా మార్కెట్లో విక్రయిచే WTI క్రూడ్‌కు, బ్రెంట్ క్రూడ్ మధ్య కనీస వ్యత్యాసం 3-4 డాలర్లు ఉండేది. ఇవాళ WTI క్రూడ్ కూడా106.57 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. క్రూడ్ ధరలు భారీగా పెరగడంతో అనేక మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా ఆందోళన చెందుతున్నాయి.