నష్టాల్లో సింగపూర్ నిఫ్టి
గత శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. నాస్‌డాక్ 1.84 శాతం లాపడగా, మిగిలిన డౌజోన్స్, ఎస్ అండ్ పీ 500 సూచీలు 2.5 శాతం వరకు లాభపడ్డాయి. కాని ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంలో కీలక మార్పులు చోటు చేసుకున్నారు. ఉక్రెయిన్ చాలా ఈజీగా రష్యాకు లొంగిపోతుందని అనుకున్న విశ్లేషకులకు భిన్నంగా ఉక్రెయిన్ పోరాడుతోంది. దీంతో రష్యాను అదుపు చేసేందుకు అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు మరిన్ని ఆంక్షలు విధించాల్సి వచ్చింది. ఉక్రెయిన్‌లో ఆయిల్ పైప్‌లైన్లపై దాడులు జరగడంతో ఆయిల్ మార్కెట్‌లో కూడా ధరలు పెరిగాయి. అమెరికా మార్కెట్ బాటలో ఇప్పటి వరకు నడచి.. గ్రీన్‌లో ఉన్న సింగపూర్ నిఫ్టి ఇపుడు నష్టాల్లోంది. దీనికి ప్రధాన అమెరికా ఫ్యూచర్స్ భారీగా నష్టపోవడమే. డౌజోన్స్, ఎస్ అండ్ పీ 500 ఫ్యూచర్స్ రెండు శాతం దాకా నష్టంతో ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నా… అధికంగా హాంగ్‌కాంగ్ మార్కెట్‌లో కన్పిస్తున్నాయి. హాంగ్‌సెంగ్ సూచీ 1.5 శాతం నష్టపోగా, జపాన్ నిక్కీ 0.8 శాతం నష్టంతో ట్రేడవుతోంది. చైనా మార్కెట్లు నామ మాత్రపు నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్ నిఫ్టి స్వల్ప లాభంతో ఉంది. నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.