For Money

Business News

మళ్ళీ దూసుకెళుతున్న క్రూడ్‌

తగ్గినట్లే కన్పించిన క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా క్షీణించాయి. ఉక్రెయిన్‌లోని ఆయిల్‌ పైప్‌లైన్లపై రష్యా దళాలు దాడులు చేయడం, చైనా క్రూడ్‌ నిల్వలు పెంచడంతో డిమాండ్‌ పెరుగుతోంది. అలాగే రష్యా ప్రభుత్వ కంపెనీ రాస్‌నాఫ్ట్‌లో ఉన్న 20 శాతం వాటాను అమ్మేయాలని బీపీ నిర్ణయించడంతో ఆయిల్‌ మార్కెట్‌లో కలకలం రేగింది. దీంతో బ్రెంట్ క్రూడ్‌ దర 4 శాతంపైగా పెరిగి 120.08 డాలర్లకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ను ఆసియా దేశాలు కొనుగోలు చేస్తాయి. ఇక అమెరికా మార్కెట్‌లో విక్రయించే WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర ఏకంగా 5 శాతం పైగా పెరిగి 96 డాలర్లు దాటింది. బ్రెంట్‌ క్రూడ్‌ మే కాంట్రాక్ట్‌ ఫ్యూచర్‌ ధర కూడా 98.30 డాలర్లకు చేరడంతో… మరో మూడు నెలలకు భారీ దరకు కొంటున్నామన్నమాట.