For Money

Business News

16,550 పైన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. చాలా వరకు నిన్న భారీగా క్షీణించిన షేర్లు ఇవాళ కోలుకోవడం వినా.. ఇతర కౌంటర్లు డల్‌గా ఉన్నాయి. నిఫ్టి ప్రస్తుతం 266 పాయింట్ల లాభంతో 16,514 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్ని సూచీలు లాభాల్లో ఉన్నాయి. నిన్న భారీగా క్షీణించిన మిడ్‌ క్యాప్‌, బ్యాంక్‌ నిఫ్టిలు ఇవాళ రికవరీలో ముందున్నాయి. నిఫ్టిలో 47 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఉదయం నుంచి ఆకర్షణీయ లాభాల్లో ఉన్న ఆసియా మార్కెట్లు… క్రమంగా బలహీనంగా మారుతున్నాయి. కాబట్టి నిఫ్టి 16500పైన నిలబడుతుందేమో చూడాలి. ఇక షేర్ల విషయానికొస్తే నిన్న భారీగా క్షీణించిన టాటా మోటార్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచింది. షేర్ల బై బ్యాక్‌ కారణంగా యూపీఎల్‌ లాభాల్లో ఉంది. నిన్న దాదాపు స్థిరంగా ఉన్న బ్రిటానియా, నెస్లే, సిప్లా షేర్లు ఇవాళ నామమాత్రపు నష్టాల్లో ఉన్నాయి.