క్రూడ్ ఆయిల్ @ 105.33 డాలర్లు
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం తీవ్రం కావడంతో స్టాక్ మార్కెట్లు భారీగా క్షీణించగా, కరెన్సీ, కమాడిటీ మార్కెట్లు భారీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా భారత్ వంటి మార్కెట్లకు ఎంతో కీలకమైన క్రూడ్ ఆయిల్ బ్యారల్ ధర 105.27 డాలర్లకు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే 8.43 శాతం చొప్పున పెరిగింది. అమెరికా మార్కెట్లలో విక్రయించే WTI క్రూడ్ ధర కూడా 8 శాతం పైగా పెరిగి 99.56 డాలర్లకు చేరింది. ఇది మార్చి నెల డెలివరీ కాంట్రాక్ట్ ధర. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరగుతున్న గొడవను బట్టి భవిష్యత్ ఆయిల్ ధర ఆధారపడి ఉంటుందని ఆయిల్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. వెంటనే క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి పెంచేందుకు ఒపెక్ దేశాలు ప్రయత్నించినా..డిమాండ్ సరిపడా ఆయిల్ సరఫరా చేయడం వెంటనే సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు. పైగా యుద్ధం భయంతో క్రూడ్ ధర 10 డాలర్ల వరకు పెరిగి ఉండొచ్చని… తగ్గినా భారీగా తగ్గే అవకాశాలు వెంటనే ఉండవని అంటున్నారు.