ఈ షేర్లను గమనించండి
ఇవాళ్టి ట్రేడింగ్‌లో దిగువ ఇచ్చిన షేర్లలో అధిక యాక్టివిటి ఉండే అవకాశముంది. అందుకు కారణాలు కూడా చదవండి.
◆విప్రో: vFunctionతో విప్రో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. అలాగే vFunctionలో పెట్టుబడి కూడా పెట్టింది. ఎంతో చెప్పలేదు
◆ హీరో మోటోకార్ప్ : దేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరోమోటో కార్ప్ బీపీసీఎల్‌తో కలిసి దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనుంది. మొదటి దశలో, ఢిల్లీ మరియు బెంగళూరుతో ప్రారంభించి తొమ్మిది నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది.
◆సన్ ఫార్మా: కంపెనీ అనుబంధ సంస్థ అయిన టారో ఫార్మాస్యూటికల్స్ 9 కోట్ల డాలర్లకు గాల్డెర్మా నుండి ధ ప్రోయాక్టివ్ కంపెనీని కొనుగోలు చేయనుంది.
◆ నజారా టెక్నాలజీస్: ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌జున్‌వాలా-వాటా ఉన్న ఈ గేమింగ్ కంపెనీ ప్రిఫరెన్షియల్ పద్ధతిలో డేటావర్క్స్ బిజినెస్ సొల్యూషన్స్‌కు ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది.
◆ MOIL : బైబ్యాక్ పూర్తయిన తర్వాత కంపెనీ 3,38,42,668 పూర్తిగా చెల్లించిన ఈక్విటీ షేర్లను రద్దు చేసింది.
◆ మహీంద్రా CIE : అనిల్ హరిదాస్ పదవికి SIS : మహానది కోల్‌ఫీల్డ్స్‌లోని 18 సైట్‌లలో సెక్యూరిటీ సొల్యూషన్‌లను అందించడానికి రూ. 225 కోట్ల విలువైన రెండు సంవత్సరాల కాంట్రాక్టును కంపెనీ దక్కించుకుంది. మరో ఏడాది కాలానికి పునరుద్ధరించుకునే అవకాశం ఉంది.
◆ దిలీప్ బిల్డ్‌కాన్ : ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ – విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ కోసం హైబ్రిడ్ యాన్యుటీ ప్రాతిపదికన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా జరిపిన టెండర్ల కోసం కంపెనీ ఎల్-ఐ బిడ్డర్‌గా నిలిచింది. ఈ ఆర్డర్ విలువ రూ .1,141 కోట్లు.
◆ అదానీ ఎంటర్‌ప్రైజెస్ & అదానీ పవర్: హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ కోసం అదానీ గ్రూప్‌తో బల్లార్డ్ పవర్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది
◆ MEP ఇన్‌ఫ్రాస్ట్రక్చర్: రూ. 87.03 కోట్ల హైవే టోల్ కలెక్షన్ ప్రాజెక్ట్‌ను గెలుచుకుంది.
◆ టాటా పవర్ : యాష్ అప్‌సైక్లింగ్ కోసం జాక్ టెక్నాలజీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.