For Money

Business News

కోలుకున్నా… నష్టాల్లోనే నిఫ్టి

ఆరంభంలో భారీ నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి తరవాత క్రమంగా కోలుకుంది. మిడ్ సెషన్‌ తరవాత కాస్త బలహీనపడినట్లు కన్పించినా.. 2 గంటల తరవాత నిఫ్టికి గట్టి మద్దతు లభించింది. దీంతో నిఫ్టి 16843 నుంచి 17148 పాయింట్లకు అంటే 300 పాయింట్లు కోలుకుంది. అయినా క్రితం ముగింపుతో పోలిస్తే 128 పాయింట్ల నష్టంతో 17,078 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టిలో 33 షేర్లు నష్టాల్లో క్లోజ్‌ కాగా, 17షేర్లు గ్రీన్‌లో ముగిశాయి. నిన్న, ఇవాళ భారీగా నష్టపోయిన నిఫ్టి నెక్ట్స్‌ ఇవాళ అనూహ్యంగా కోలుకుని కేవలం 0.2 శాతం నష్టంతో ముగిసింది. అదే బ్యాంక్‌ నిఫ్టి, మిడ్‌ క్యాప్‌ నిఫ్టిలు 0.8 శాతంపైగా నష్టంతో ముగిశాయి. ఇవాళ కోలుకున్న షేర్లలో ఆటో రంగానికి చెందిన షేర్లు ఉండటం విశేషం. నష్టపోయిన షేర్లలో టాటా స్టీల్‌, బీపీసీఎల్‌, టీసీఎస్‌ వంటి షేర్లు ఉన్నాయి. సూచీలు కోలుకున్నట్లు కన్పిస్తున్నా… షేర్లు మాత్రం భారీ నష్టాలతో ముగిశాయి.