స్థిరంగా కొనసాగుతున్న నిఫ్టి
ఉక్రెయిన్ – రష్యా ఘర్షణపై దౌత్యపరమైన చర్యలు కొనసాగుతున్న చర్యల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. ఉదయం నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి ఇపుడు గ్రీన్‌లో కొనసాగుతోంది. ప్రస్తుతం 46 పాయింట్ల లాభంతో 17350 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. యూరో మార్కెట్లు లాభాల్లో ట్రేడవడంతో పాటు అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లో ఉండటంతో మన మార్కెట్లో పతనం ఆగింది. మరి ఇది చివరిదాకా కొనసాగుతుందా అనేది చూడాలి. నిన్న భారీగా క్షీణించిన బ్యాంక్ నిఫ్టి ఇవాళ అర శాతం లాభంతో ట్రేడవుతోంది. అయితే మిడ్‌క్యాప్ సూచీ మాత్రం నష్టంతో ట్రేడవుతోంది. ఎల్ఐసీ ఐపీఓ నేపథ్యంలో లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లలో ఆసక్తి కన్పిస్తోంది. మొన్నటి వరకు ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ పెరగ్గా. ఇవాళ ఎస్బీఐ లైఫ్ లాభాల్లో ఉంది.