సగం తగ్గిన అంబుజా సిమెంట్స్ లాభం
డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అంబుజా సిమెంట్స్ ఘోరమైన ఫలితాలను ప్రకటించింది. సీఎన్‌బీసీ టీవీ18 జరిపిన సర్వేలో అనలిస్టులు రూ. 440 కోట్ల నికర లాభం ప్రకటిస్తుందని అంచనా వేశారు. ఇది గత ఏడాది నికర లాభం కన్నా రూ.50 కోట్లు తక్కువ. అయితే రూ.251 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. గత ఏడాది ఇదేకాలంలో కంపెనీ నికర లాభం రూ. 497 కోట్లు. టర్నోవర్ 6.3 శాతం పెరిగి రూ. 3735 కోట్లకు చేరినా… నికర లాభం సగానికి పడిపోయింది. దీంతో ఎబిటా 26 శాతం తగ్గి రూ.768 కోట్ల నుంచి రూ. 567 కోట్లకు పడిపోయింది. అలాగే మార్జిన్ 6.70 శాతం క్షీణించి 21.9 శాతం నుంచి 15.2 శాతనికి తగ్గింది.