For Money

Business News

రష్యా ఎపుడైనా దాడి చేయొచ్చు

ఉక్రెయిన్‌పై రష్యా ఏక్షణమైనా దాడికి దిగొచ్చని వైట్‌హౌస్‌ పేర్కొంది. ఈ అంశంపై ఇవాళ మ్యూనిచ్‌లో ప్రపంచ దేశాల నేతల సమావేశం అవుతున్నారు. ఈ భేటీకి హాజరు కావాల్సిందిగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో పాటు విదేశాంగ మంత్రి టోని బ్లింకెన్‌ను పంపుతున్నారని వైట్‌హౌస్‌ వెల్లడించింది. మాస్కోకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను ఒక్కటి చేసే దిశగా వీరు కృషి చేస్తారని పేర్కొంది. ఉక్రెయిన్‌ సరిహద్దుల నుంచి తన సేనలను వెనక్కి తీసుకున్నట్లు రష్యా అబద్ధాలు చెబుతోందని అమెరికా ఆరోపించింది. అదనంగా 7000 దళాలను ఉక్రెయిన్‌ సరిహద్దులకు తరలించిందని పేర్కొంది.