For Money

Business News

మార్కెట్లకు యూరో అండ

ఉదయం నుంచి డల్‌గా ఉన్న మార్కెట్లకు యూరో మార్కెట్లు కలిసి వచ్చాయి. ఉదయం ఒక మోస్తరు లాభాలతో ప్రారంభమైనా… వెంటనే నష్టాల్లోకి వెళ్ళి పోయాయి. అయితే యూరో ఫ్యూచర్స్‌ స్వల్ప నష్టాలతో ఉండటంతో మన మార్కెట్లు కోలుకవడం ప్రారంభమైంది. అయితే యూరో మార్కెట్లు ప్రారంభమైన వెంటనే లాభాల్లో ఉఆవడంతో నిఫ్టి పరగులు తీసింది. ప్రస్తుతం యూరో మార్కెట్లు ఒక శాతంపైగా లాభంతో ఉన్నాయి. యూరో స్టాక్స్‌ 1.20 శాతం లాభంతో ట్రేడవుతోంది. దీంతో నిఫ్టి 16839 నుంచి 17,185కి చేరింది. అంటే దాదాపు 340 పాయింట్ల రికవరీ వచ్చింది. నిఫ్టిలో కేవలం నాలుగు షేర్లు మాత్రమే నష్టాల్లోఉన్నాయి. ఇటీవల బాగా క్షీణించిన షేర్లు భారీగా కోలుకున్నాయి. శ్రీసిమెంట్స్‌ 5 శాతం లాభంతో ఉండటం విశేషం. ఇక మిడ్‌ క్యాప్‌ నిఫ్టిలో జీ టీవీ ఏకంగా 7 శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది.