NIFTY TODAY: 16900 కీలకం
మార్కెట్ ఏమాత్రం పెరిగినా అమ్మడమే అన్న ఫార్ములాను అనలిస్టులు సూచిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర హెచ్చతగ్గులకు లోనవుతున్నాయి. పైకి గ్రీన్‌లో ముగిసినా… అంతకుమునుపు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. రాత్రి అమరికాలో అదే జరిగింది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో ఇదే కన్పిస్తోంది. ఇక మన మార్కెట్ విషాయనికొస్తుంటే… యూపీ ఎన్నికలను మార్కెట్ లోతుగా గమనిస్తోంది. సాధారణ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వాయిదా వేస్తున్నారు. ఎల్ఐసీ ఐపీఓ కూడా ఒక కారణం. ఇవాళ సింగపూర్ నిఫ్టి 125 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి ఇదే స్థాయి లాభాలతో ప్రారంభమైనా… నిలబడుతుందా అన్న అనుమానం ఉంది. దీనికి ప్రధాన కారణంగా అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు అరశాతం నష్టాల్లో ఉన్నాయి. సో… పూర్తిగా టెక్నికల్స్‌ను బట్టి ట్రేడ్ చేయండి. నిఫ్టి పెరిగితే అమ్మడానికి ఛాన్స్‌గా భావించండి.
రెండో ప్రతిఘటన 16997
తొలి ప్రతిఘటన 16902
నిఫ్టికి కీలకం 16840
తొలి మద్దతు 16780
రెండో మద్దతు 16688
ఈ స్థాయిని కోల్పోతే అమ్మకాలు జోరుగా ఉంటాయి.