కార్వి రిజిస్ట్రేషన్ రద్దు
హైదరాబాద్‌కు చెందిన కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎసీబీఎల్) రిజిస్ట్రేషన్‌ను సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) రద్దు చేసింది. ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కార్వీతో పాటు కేఎస్‌బీఎల్, కానార్డ్ సెక్యూరిటీస్, అనీ సెక్యూరిటీస్, క్రెడిన్షియల్ స్టాక్ బ్రోకర్స్ సంస్థల రిజిస్ట్రేషన్‌ను కూడా సెబీ రద్దు చేసింది. ఈ స్టాక్ బ్రోకింగ్ సంస్థలు తమ ‘సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్’ ను దుర్వినియోగం చేయకుండా ఉండటానికి ఈ చర్య తీసుకున్నట్లు సెబీ వెల్లడించింది. కార్వీ సంస్థపై ఇప్పటికే పలు తీవ్ర ఆర్థిక నేరాలు నమోదు అయిన విషయం తెలిసిందే.