For Money

Business News

గ్లోబల్‌ ర్యాకింగ్స్‌లో 32వ స్థానం

మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) దూసుకుపోతోంది. ఫైనాన్షియల్‌ టైమ్స్‌ (ఎఫ్‌టీ) నిర్వహించిన ‘గ్లోబల్‌ ఎంబీఏ-2022’ ర్యాంకింగ్‌లో ఐఎ్‌సబీ నిర్వహించే పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీపీ)కు 32వ స్థానం దక్కింది. దేశీయంగా చూస్తే మాత్రం ఐఎస్‌బీ పీజీపీ అగ్రస్థానంలో నిలిచింది. ఆసియా మొత్తం మీద చూసినా నాలుగో స్థానంలో ఉంది. పీజీపీ 2018 బ్యాచ్‌ పనితీరు ఆధారంగా ఎఫ్‌టీ ఈ ర్యాంకింగ్‌ రూపొందించింది. జీతాల పెంపు శాతం ఆధారం గా చూస్తే పీజీపీ విద్యార్థులు అగ్రస్థానంలో ఉన్నారు. 2021-22 సంవత్సరానికి ‘పోయెట్స్‌ అండ్‌ క్వాంట్‌ కాంపోజిట్‌ ర్యాంకింగ్‌లో కూడా ఐఎస్‌బీకి 11వ ర్యాంక్‌ వచ్చింది.