నాట్కో లాభంలో 27% వృద్ధి
హైదరాబాద్‌కు చెందిన నాట్కో ఫార్మా కంపెనీ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. డిసెంబరు త్రైమాసికానికి కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 27 శాతం వృద్ధి చెంది రూ.80.4 కోట్లకు చేరింది. 20 ఇదే కాలంలో నికర లాభం రూ.63.4 కోట్లు. మొత్తం ఆదాయం కూడా రూ.355.2 కోట్ల నుంచి 53 శాతం పెరిగి రూ.560.5 కోట్లకు చేరింది. ఈ కాలంలో ఏపీఐ ఆదాయం రూ.61.7 కోట్లు కాగా, ఫార్ములేషన్స్ వ్యాపారం రూ.100.3 కోట్లని కంపెనీ పేర్కొంది. షేరుకు రూ.2 చొప్పున (100 శాతం) మూడో మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. కంపెనీ షేర్ ముఖ విలువ రూ.2. ఈ డివిడెండ్‌కు రికార్డు తేది ఈ నెల 2. మార్చి 4 నుంచి మధ్యంతర డివిడెండ్ చెల్లిస్తారు. మరోవైపు ఇప్పటి వరకు ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉన్న ఎస్ మూర్తిని చైర్మన్‌గా కంపెనీ నియమించింది. ఈ నియామకం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. అలాగే ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా వీసీ నన్నపనేని, రాజీవ్ నన్నపనేని డైరెక్టర్, సీఈఓగా తిరిగి నియమితులయ్యారు.