SGX Nifty 222 పాయింట్లు డౌన్
శుక్రవారం అమెరికా మార్కెట్ల అమ్మకాల ఒత్తిడి ఇవాళ ప్రపంచ మార్కెట్లపై కన్పిస్తోంది. శుక్రవారం అమెరికా మార్కెట్లలో ముఖ్యంగా నాస్డాక్ 2.76 శాతం క్షీణించగా, ఎస్ అండ్ పీ 500 సూచీ 1.9 శాతం క్షీణించింది. అలాగే డౌజోన్స్ ఒకటిన్నర శాతం తగ్గింది. దీంతో ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో కూడా అమ్మకాలు సాగుతున్నాయి. శుక్రవారం జపాన్ మార్కెట్ పనిచేయలేదు. దీంతో ఇపుడు జపాన్ నిక్కీ 2.35 శాతం నష్టంతో ట్రేడవుతోంది. చైనా మార్కెట్ల నష్టాలు ఒక శాతంలోపే ఉన్నా.. హాంగ్‌సెంగ్ 1.4 శాతం, తైవాన్ 1.8, న్యూజిల్యాండ్1.6 శాతం నష్టంతో ట్రేడవుతోంది. సింగపూర్ నిఫ్టి ప్రస్తుతం 222 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఈ సంకేతాలు చూస్తుంటే నిఫ్టికి ఇవాళ భారీ నష్టాలు తప్పేలా లేవు.