మారుతి EV రెడీ అవుతోంది…
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి(ఎంఎస్ఐ) నుంచి తొలి ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) రెడీ అవుతోంది. టయోటా కిర్లోస్కర్ మోటార్స్‌తో కలిసి గ్లోబల్ మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మారుతి సుజుకి అభివృద్ధిచేస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారుకి వైవై8 అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తున్నాయి. ఈ కారును విదేశాలకు కూడా ఎగుమతి చేసేలా రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. గుజరాత్ ప్లాంట్లలో తయారు చేస్తున్న ఈ కారుకు సంబంధించి అనేక అంశాలు ఇపుడు మీడియాలో వస్తున్నాయి. …వైవై8 4.2 మీటర్ల పొడవైన బాడి, పొడవైన 2,700 మీ.మీ వీల్ బేస్ తయారవుతున్న ఈ కారులో 48 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీతో కూడిన సింగిల్ 138 హెచ్‌పీ మోటార్ ఉంటుంది. ఈ మోడల్ ఎలక్ట్రిక్ కారుని ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 400 కి.మీ. ప్రయాణం చేయొచ్చు. 59 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ, 170 హెచ్‌పీ మోటార్ గల మోడల్ కారు 500 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని సమాచారం. 2025లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోకి రావొచ్చు. ఈ కారు ధర రూ.13-15 లక్షలు ఉంటుందని అంచనా.