సెబి వద్ద ఎల్‌ఐసీ ప్రాస్పెక్టస్ దాఖలు
ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) ఇవాళ సాయంత్రం స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి వద్ద ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఈ కంపెనీలో ప్రమోటర్‌కు వంద శాతం వాటా ఉంది. ఆర్థిక శాఖ,భారత ప్రభుత్వం తరఫున భారత రాష్ట్రపతి ఈ కంపెనీకి ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్నారు. కంపెనీ మూలధనంలో 5 శాతం వాటాను పబ్లిక్ ఆఫర్ ద్వారా విక్రయించడానికి ఎల్‌ఐసీ ప్రతిపాదించింది. మొత్తం 31,62,49,885 షేర్లను పబ్లిక్ ఆఫర్ ద్వారా ఎల్‌ఐసీ విక్రయించనుంది.