సీబీఐ చరిత్రలో అతి పెద్ద బ్యాంక్ స్కామ్
ఫైనాన్సియల్ రంగంలో అతి పెద్ద స్కామ్‌ను ఇవాళ సీబీఐ నమోదు చేసింది. ఏబీజీ గ్రూప్‌నకు చెందిన ఏబీజీ షిప్‌యార్డ్ అనే కంపెనీ రూ. 22,841 కోట్లను బ్యాంకులకు ఎగ్గొట్టింది. దీనికి సంబంధించి బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2012 నుంచి 2017 మధ్య కాలంలో ఈ స్కామ్‌కు కంపెనీ పాల్పడింది.కంపెనీ సీఎండీ రిషి అగర్వాల్‌తో పాటు పలు కంపెనీలు, వాటి డైరెక్టర్లపై కేసు నమోదు చేసింది. వీటిలో ఏబీజీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఉంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు వివిధ కంపెనీల ద్వారా లాండరింగ్ పాల్పడినట్లు ఫోరెన్సిక్ ఆడిట్లో బయటపడింది. ఈ కంపెనీకి రుణాలు ఇచ్చిన 28 బ్యాంకుల్లో అత్యధికంగా ఎస్బీఐ ఇచ్చింది. ఎస్బీఐ రూ. 2925 కోట్ల రుణం ఇచ్చింది. ఇతర బ్యాంకుల్లో ఐసిఐసిఐ బ్యాంక్ (రూ. 7,089 కోట్లు), ఐడిబిఐ బ్యాంక్ (రూ. 3,634 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ. 1,614 కోట్లు), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (రూ. 1,244 కోట్లు,బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ. 1,228 కోట్లు) ఉన్నాయి. ఏబీబీ షిప్ యార్డ్ కంపెనీ షిప్ బిల్డింగ్‌తో పాటు రిపేర్లు నిర్వహించేది. ఈ కంపెనీకి గుజరాత్‌లోని సూరత్, దహేజ్‌లలో యార్డులు ఉన్నాయి.