థమ్స్ అప్… బిలియన్ డాలర్స్
దేశీ సాఫ్ట్ డ్రింక్ థమ్స్ అప్ మరో రికార్డు సాధించింది. 2021లో ఈ బ్రాండ్ విలువ వంద బిలియన్ డాలర్లు అంటే రూ.7500 కోట్లు దాటింది. ఈ బ్రాండ్ ప్రస్తుతం కోక కోలా చేతిలో ఉన్న విషయం తెలిసిందే. అట్లాంటా కేంద్రంగా పనిచేస్తున్న రమేష్ చౌహాన్ నుంచి థమ్స్ అప్‌ను కోక కోలా 1993లో కొనుగోలు చేసింది. తరవాత అదే కంపెనీ నుంచి గోల్డ్ స్పాట్, లిమ్కా బ్రాండ్‌లను కూడా కొనుగోలు చేసింది. కాని థమ్స్ ఇప్పటికే యంగ్ బ్రాండ్‌గా దేశంలో రాణిస్తోంది. 1977లో అప్పటి ప్రధాని మొరార్జి దేశాయ్ కోక కోలాను నిషేధించడంతో …రమేష్ చౌహాన్ థమ్స్ ఆప్‌ను తీసుకు వచ్చారు.