NIFTY TODAY: 17,443 కీలకం
కార్పొరేట్ ఫలితాల సీజన్ అయిపోవస్తోంది. ఆర్బీఐ క్రెడిట్ పాలసీ కూడా నిన్న వచ్చేసింది. ఇక మార్కెట్‌కు పాజిటివ్ ట్రిగ్గర్స్ ఇప్పట్లో పెద్దగా లేవు. యూపీ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు మార్కెట్ ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లకు స్పందించే అవకాశముంది. ఇవాళ సింగపూర్ నిఫ్టి190 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టి క్రితం ముగింపు 17605. నిఫ్టి డే ట్రేడర్స్‌కు ఇవాళ్టి లెవల్స్…
తొలి ప్రతిఘటన – 17,727
నిఫ్టికి కీలక స్థాయి -17,504
తొలి మద్దతు -17,490
రెండో మద్దతు -17,440
డౌన్ బ్రేకౌట్ -17,380
టెక్నికల్‌గా నిఫ్టికి ‘బై’ సిగ్నల్స్ ఉన్నాయి. కాని మార్కెట్ సెంటిమెంట్ ప్రతికూలంగా ఉంది. దిగువ స్థాయిలో ముఖ్యంగా 17,440 లేదా 17,400 ప్రాంతంలో నిఫ్టికి మద్దతు అందుతుందా అన్నది చూడాలి. రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు పెరిగినపుడు అమ్మొచ్చు. లేదంటే ట్రేడింగ్‌కు దూరంగా ఉండటం బెటర్.