For Money

Business News

వాల్‌స్ట్రీట్‌పై ద్రవ్యోల్బణం దెబ్బ

అమెరికాలో ద్రవ్యోల్బణ రేటు 40 ఏళ్ళ గరిష్ఠ స్థాయికి చేరడంతో పాటు నిరుద్యోగ భృతి కోసం వచ్చే దరఖాస్తుల సంఖ్య తగ్గడంతో… ఫెడరల్‌ రిజర్వ్‌ మార్చిలో కచ్చితంగా 0.5 శాతం మేర వడ్డీ రేట్లను పెంచుతుందని స్టాక్‌ మార్కెట్‌ గట్టి నమ్ముతోంది. ఆర్థిక వ్యవస్థ ఇంత పటిష్ఠంగా ఉండటంతో పాటు ఉద్యోగ అవకాశాలు బాగా పెరిగిన నేపథ్యంలో ద్రవ్యోల్బణం కట్టడికి ఫెడ్‌ ప్రాధాన్యం ఇచ్చే అవకాశముంది. దీంతో వాల్‌స్ట్రీల్‌ రెడ్‌లో ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడి బాగా ఉండటంతో సూచీలు బాగా నష్టపోయాయి. అయితే ఇపుడు కోలుకున్నాయి. నాస్‌డాక్‌ అరశాతం నష్టంతో ట్రేడవుతుండగా, మిగిలిన ఎస్‌ అండ్ పీ 500, డౌజోన్స్‌ సూచీలు 0.41 శాతం చొప్పున నష్టంతో ట్రేడవుతున్నాయి. జాబ్‌ డేటా దెబ్బకు డాలర్‌ కూడా బాగా క్షీణించింది. ఇపుడు మొన్ననే 96 దిగువకు వచ్చిన డాలర్‌ ఇండెక్స్‌ ఇపుడు 95.25కు క్షీణించింది. ఈ దెబ్బకు క్రూడ్‌ ఆయిల్‌ రేట్లు మళ్ళీ పుంజుకున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 92.60 డాలర్లకు, WTI క్రూడ్‌ 91 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌ క్షీణించినా… బులియన్‌లో ఆ ఉత్సాహం లేదు. బంగారం స్వల్పంగా పెరగ్గా, వెండి మాత్రం ఒక శాతం పెరిగింది. 1840 డాలర్ల వద్ద బంగారానికి గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది.