MID SESSION: 17600పైన నిఫ్టి
ఆర్బీఐ పాలసీకి ముందు లాభాల్నీ పొగొట్టుకున్న నిఫ్టి… పాలసీ ప్రకటన తరవాత లాభాల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిఫ్టి క్రమంగా బలపడుతూ వచ్చింది. నిఫ్టి కాస్సేపటి క్రితం 17622 పాయింట్లను తాకింది. నిఫ్టిలో 38 షేర్లు లాభాల్లో ఉన్నాయి. 12 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. రివర్స్ రెపో రేట్లను పెంచుతారనే అంచనాతో మార్కెట్ ఉంది. అయితే వడ్డీ రేట్లను మార్చడం లేదని ఆర్బీఐ ప్రకటించడంతో బ్యాంక్ షేర్లు భారీగా పెరిగాయి. బ్యాంక్ నిఫ్టి 1.4 శాతం పెరిగింది. ప్రైవేట్ బ్యాంకు షేర్లు చాలా లాభపడ్డాయి. అయితే మిడ్ క్యాప్, నిఫ్టి నెక్ట్స్ సూచీలు మాత్రం చాలా నామ మాత్రపు లాభాలతో ట్రేడవుతున్నాయి. మరోవైపు యూరో మార్కెట్లు నిస్తేజంగా ఉన్నాయి. వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉన్నందున ఈ లాభాలు చివరిదాకా ఉంటాయా అన్నది చూడాలి.