For Money

Business News

కుప్పకూలిన షేర్‌ మార్కెట్‌

బడ్జెట్‌ తరవాత ప్రారంభించిన డ్రామాకు తెరపడింది. ఏమీ లేని బడ్జెట్‌ గురించి రెండు, మూడురోజులు హైప్‌ క్రియేట్‌ చేసి… ఇన్వెస్టర్లను ముంచేశారు. బడ్జెట్‌ను నమ్మి మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేసిన ఇన్వెస్టర్లు ఘోరం దెబ్బతిన్నారు.వరుసగా విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలను దేశీయ ఆర్థిక సంస్థలు తట్టుకోలేకపోతున్నాయి. దీంతో సూచీలు నాన్‌ స్టాప్‌గా పడుతూనే వస్తోంది. ఉదయం నష్టాల్లో ఉన్న చాలా వరకు ఆసియా మార్కెట్లు కోలుకోగా, యూరప్‌ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. యూరో స్టాక్స్‌ 50 సూచీ 0.05 శాతం లాభంతో ఉంది. అయినా మన మార్కెట్లలో వచ్చిన భారీ అమ్మకాల ఒత్తిడి అన్ని రంగాల సూచీలు నష్టాలతో ముగిశాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, బ్యాంక్‌, హెల్త్‌కేర్‌, రియాల్టి, క్యాపిటల్‌ గూడ్స్‌ షేర్లు ఒక శతం నుంచి రెండు శాతం వరకు నష్టపోయాయి. ఇక సూచీల విషయానికొస్తే అత్యధికంగా ఫైనాన్షియల్‌ నిఫ్టి, బ్యాంక్‌ నిఫ్టి రెండు శాతంపైగా నష్టపోయాయి. శుక్రవారం భారీగా క్షీణించిన మిడ్‌ క్యాప్‌ సూచీ ఇవాళ కూడా 0.8 శాతం నష్టపోయింది. ఇక నిఫ్టి ఉదయం 17,536 స్థాయిని తాకి… మిడ్‌సెషన్‌లో 17119 పాయింట్ల కనిష్ఠ స్థాయికి చేరింది. క్లోజింగ్‌లో 17213 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 302 పాయింట్లు నష్టపోయింది. 17,580 దాటితే కాని కొనుగోళ్ళ జోలికి వెళ్ళొద్దని ఉదయం టెక్నికల్ అనలిస్టులు హెచ్చించారు. మార్కెట్‌కు ట్రిగ్గర్స్‌ ఏవీ లేనందున నిఫ్టి పతనానికే ఛాన్స్‌ ఉందని వారు వేసిన అంచనా నిజమైంది.నిఫ్టిలో 42 షేర్లు నష్టాల్లో ముగిశాయి.