వడ్డీ రేట్లు పెంచడం ఖాయం?
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతి కారణంగా ఇవాళ మహారాష్ట్రలో సెలవు ప్రకటించారు. దీంతో ఇవాళ ప్రారంభం కావాల్సిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం ఒక రోజు వాయిదా వడింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు భేటీ కానుంది. ఈనెల 9న పాలసీ సమీక్షకు సంబంధించి ఆర్బీఐ గవర్నర్ ప్రకటన చేస్తారు. ఈసారి వడ్డీ రేట్లను పెంచడం ఖాయమని బ్యాంకర్లు భావిస్తున్నారు. అయితే ఎంత వరకు పెంచుతారనే అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కనీసం 0.20 శాతం నుంచి 0.25 శాతం పెంచడం ఖాయమని తెలుస్తోంది. గత శుక్రవారం వెలువడిన అమెరికా జాబ్ డేటా తరవాత మార్చిలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం ఖాయమని తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో ఫెడ్కన్నా ముందే ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచుతుందని భావిస్తున్నారు.