For Money

Business News

డే ట్రేడింగ్‌కు రెండు షేర్లు

మార్కెట్‌ వచ్చే వారం 17,500 ప్రాంతంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుందని ఎస్‌ సెక్యూరిటీస్‌కు చెందిన అమిత్‌ త్రివేది అంటున్నారు. కాబట్టి షేర్లు, రంగాల ఆధారంగా షేర్లలో ట్రేడింగ్‌ చేయడం మంచిదని ఆయన సలహా ఇస్తున్నారు. ఎఫ్ఎంసీజీ రంగంలోని షేర్లకు వచ్చే వారం మద్దతు ఇవ్వొచ్చని ఆయన అన్నారు. ఎకనామిక్‌ టైమ్స్‌ పాఠకుల కోసం ఆయన రేపు అంటే సోమవారం డే ట్రేడింగ్‌ కోసం రెండు షేర్లను కూడా ట్రేడ్‌ చేశారు. ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ షేర్‌ను రూ.1,785 -1,790 మధ్య కొనుగోలు చేయాలని ఆయన సలహా ఇస్తున్నారు. రూ. 1725 స్టాప్‌లాస్‌తో రూ. 1910 టార్గెట్‌ కోసం కొనుగోలు చేయొచ్చని అంటున్నారు. బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ షేర్‌ను రూ. 1220 వద్ద కొనుగోలు చేయాలని అమిత్‌ త్రివేది సలహా ఇస్తున్నారు. రూ. 1320 లక్ష్యం కోసం రూ. 1170 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయాలని సిఫారసు చేస్తున్నారు. ఈ షేర్‌ డిసెంబర్‌ నాటి గరిష్ఠ స్థాయి నుంచి 20 శాతం తగ్గింది. ప్రస్తుత స్థాయి నుంచి పెరిగే అవకాశముంది. రూ. 1200 సమీప భవిష్యత్తులో మద్దతు స్థాయిగా ఉంటుందని అమిత్‌ త్రివేది అంటున్నారు.