For Money

Business News

క్రూడ్‌ ఆయిల్‌ @ 91.50 డాలర్లు

ఏడేళ్ళ గరిష్ఠ స్థాయిని బ్రేక్‌ చేసేందుకు క్రూడ్‌ ఆయిల్‌ రెడీగా ఉంది. మరికొన్ని గంటల్లో ఒపెన్‌ దేశాలు భేటీ అవుతున్న నేపథ్యంలో ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్‌ క్రూడ్‌ ధర 91.50 డాలర్లను దాటింది. WTI క్రూడ్‌ రేట్లు కూడా 91 డాలర్లకు చేరువవుతోంది. 2014 తరవాత క్రూడ్‌ ధరలు ఈ స్థాయికి రావడం ఇదే మొదటిసారి. క్రూడ్‌ ఉత్పత్తి పెంచేందుకు ఒపెక్‌ దేశాలు సిద్ధంగా లేవని వార్తలు వస్తున్నాయి. మరోవైపు క్రూడ్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో డాలర్‌ బలహీనపడటం భారత్‌ వంటి మార్కెట్లకు కాస్త ఊరట కల్గించే అంశం. అయినా … ఈ స్థాయి క్రూడ్‌ ధరలతో భారత ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు భారీ నష్టాలను భరించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. అసెంబ్లీ ఎన్నికల తరవాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.