For Money

Business News

NIFTY TODAY: నిఫ్టి నిలబడేనా?

నిన్న ఫేస్‌బుక్‌ ఇవాళ అమెజాన్‌… అమెరికా మార్కెట్లను కుదిపేస్తున్నాయి. లక్షల కోట్ల రూపాయల సంపద నిమిషాల్లో కరిగిపోయింది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు స్థిరంగా లేదా స్వల్ప లాభంతో ప్రారంభం కానున్నాయి. నిన్న మన మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇవాళ నిఫ్టి కూడా సింగపూర్‌ స్థాయిలో లాభాలతో ప్రారంభమైనా… నిఫ్టి నిలబడుతుందా అన్న అనుమానాలు మార్కెట్‌లో ఉన్నాయి. అయితే ఇప్పటికైతే మార్కెట్‌ బై ఆన్‌ డిప్ ఫార్ములా కొనసాగుతోంది. మరి నిఫ్టికి ఇవాళ దిగువ స్థాయిలో మద్దతు లభిస్తుందా అన్నది చూడాలి. డే ట్రేడర్స్‌ కింద లెవల్స్‌ చూడగలరు.

అప్‌ బ్రేకౌట్‌ 17726
రెండో ప్రతిఘటన 17681
తొలి ప్రతిఘటన 17652
నిఫ్టి కీలక స్థాయి 17618
తొలి మద్దతు 17469
రెండో మద్దతు 17439

అధిక స్థాయిలో కొనుగోలుకన్నా… దిగువ స్థాయి కోసం ఎదురు చూసి కొనుగోలు చేయడం మంచిదని అనలిస్టులు హెచ్చరిస్తున్నారు.