For Money

Business News

అప్పర్ సర్క్యూట్‌లో టాటా టెలీ

టాటా టెలిసర్వీసెస్ (మహారాష్ట్ర) షేర్లు ఉదయం నుంచి 5 శాతం అప్పర్‌ సీలింగ్‌తో ట్రేడ్‌ అవుతున్నాయి. భారీ కొనగోళ్ళ మద్దతు కారణంగా 5 శాతం లాభంతో రూ. 148.80 వద్ద ట్రేడవుతోంది. ఈ ధర వద్ద ఎన్‌ఎస్‌ఈలో అమ్మకందారులు లేరు. ఇదే ధర వద్ద 24 కోట్ల షేర్లకు కొనుగోలు ఆర్డర్లు ఉండటం విశేషం. ఏజీఆర్ బకాయిలకు సంబంధించిన వడ్డీని ఈక్విటీగా మార్చి ప్రభుత్వానికి ఇవ్వాలన్న ప్రతిపాదనను కంపెనీ విరిమించుకుంది. దీంతో ఈ కంపెనీ షేర్‌లో ఇన్వెస్టర్ల ఆసక్తి పెరిగింది. “కన్వర్షన్‌కు అర్హత ఉన్న వడ్డీ మొత్తం కంపెనీ అంచనా వేసిన దాని కంటే చాలా తక్కువగా ఉన్నందున,ఫిబ్రవరి 1, 2022న జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో కన్వర్షన్ చేయాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకోవాల”ని కంపెనీ నిర్ణయించింది. జనవరి 10, 2022న కంపెనీ రూ. 850 కోట్ల ఏజీఆర్ బకాయిలకు సంబంధించిన వడ్డీని ఈక్విటీగా మార్చాలని టాటా గ్రూప్ టెలికాం సర్వీస్ నిర్ణయించిన తరవాత షేర్‌ ధర సగానికి పైగా పడిపోయింది. జనవరి 11, 2022న రికార్డు స్థాయిలో రూ.291.05ను తాకిన షేర్‌ నిన్న రూ. 141.75 వద్ద ముగిసింది. అంటే సగానికి పైగా పడింది.