అంచనాలు మించిన ప్రత్యక్ష పన్ను వసూళ్ళు
మూడేళ్ళ తరవాత ప్రభుత్వం ప్రత్యక్ష పన్ను వసూళ్ళలో లక్ష్యాన్ని దాటింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 11.08 లక్షల కోట్ల పన్నులను వసూలు చేయాలని గత బడ్జెట్లో ప్రతిపాదించారు. 22-23 బడ్జెట్లో గత ఏడాది అంటే 21-22 బడ్జెట్ సవరించిన అంచనాలను చూపారు. దీని ప్రకారం 21-22లో ప్రభుత్వం రూ. 12.5 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులను వసూలు చేసింది. ఈ అంచనాల ప్రకారం కార్పొరేట్ పన్ను రూపేణా రూ. 6.35 లక్షల కోట్లు, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ రూపేణా రూ. 6.15 లక్ష లక్షల కోట్లు వసూలు చేశారు. ఇంతకుమునుపు 2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్ళ లక్ష్యం రూ.9.8 లక్షల కోట్లు పెట్టుకోగా, రూ. రూ.10.05 లక్షల కోట్లను వసూలు చేశారు.