For Money

Business News

నిర్మలమ్మ వరం… వజ్రాలు చౌక

మధ్య తరగతి, పేద ప్రజల సంగతేమోగాని… వజ్రాలు కొనేవారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుభ వార్త చెప్పారు. కట్ చేసిన అలాగే పాలిష్‌ చేసిన వజ్రాలపై దిగుమతి సుంకం 7.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. సాధారణ సాన్‌ (పాలిష్‌ చేయని) వజ్రాలపై కస్టమ్స్‌ డ్యూటీ పూర్తిగా ఎత్తేశారు. అంటే ఎలాంటి కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించకుండా ముడి వజ్రాలు తెప్పించుకుని ఇక్కడ మీరు పాలిష్‌ పెట్టించుకోవచ్చు. దీనిపై ఆల్‌ ఇండియా జెమ్ అండ్ జ్యువలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఆషిస్‌ పేతే మాట్లాడుతూ… మొత్తం మీద బడ్జెట్ చాలా సానుకూలంగా ఉందన్నారు. గ్రామీ ఆర్థికవ్యవస్థ అభివృద్ధిపై బడ్జెట్ అధిక శ్రద్ధ చూపిందని, దీనివల్ల పరోక్షంగా వజ్రాలు, నగల పరిశ్రమ లాభపడుతుందని అన్నారు. మరోవైపు ఇమిటేషన్‌ నగల దిగుమతిని నిరుత్సాహ పరిచేందుకు గాన.. వీటిపై కిలోపై రూ. 400 డ్యూటీ వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. నగల ఎగుమతి చేసేవారు ఈ కామర్స్‌ ద్వారా వ్యాపారం చేసుకునేందుకు జూన్‌ నుంచి కొత్త నిబంధనలను అమలు చేస్తామని అన్నారు.