బీపీసీఎల్ నికర లాభం రూ. 2,805 కోట్లు
పెట్రోల్, డీజిల్ అమ్మకాల ద్వారా ఒక వైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం జనాలను దోచుకుంటున్నా.. ఆయిల్ కంపెనీలకు వేల కోట్లా నికర లాభాలు వస్తున్నాయి. అంటే అన్ని రకాల ఖర్చులు, పన్నులు కూడా పోను భారీ లాభం చూపుతున్నాయి. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో బీపీసీఎల్ కంపెనీ రూ. 2805 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న నికర లాభం రూ. 1900 కోట్లతో పోలిస్తే ఇది 47.63 శాతం ఎక్కువ. ఈ మూడునెలల్లో కంపెనీ ఆదాయం 35 శాతం పెరిగి రూ. 87,292 కోట్ల నుంచి రూ. 1,17,702 కోట్లకు చేరింది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్ 3.04 శాత. అదే నికర లాభ మార్జిన్ 2.38 శాతం. ఈసారి రెండో తాత్కాలిక డివిడెండ్ కింద ఇన్వెస్టర్లకు షేర్‌కు రూ. 5 చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది.