టాటాలకు నీలాచల్ ఇస్పాత్ విక్రయం

ఇటీవల కాలంలో దేశంలోని ఓ పెద్ద స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం అమ్మేసింది. ఒడిషాలోని నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌ను టాటా గ్రూప్‌నకు చెందిన టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ కంపెనీకి అమ్మేసేందుకు కేంద్రం ఇవాళ ఆమోద ముద్ర వేసింది. నీలాచల్ ఇస్పాత్ అమ్మేయడానికి గత ఏడాది కేంద్రం బిడ్స్ ఆహ్వానించింది. వచ్చిన బిడ్లలో అత్యధిక మొత్తం కోట్ చేసిన టాటాలకు అమ్మేందుకు ఇవాళ భేటీ అయిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. రూ. 12,100 కోట్లకు ఈ స్టీల్‌ను అమ్మేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కంపెనీలో కేంద్రానికి ఎలాంటి వాటా లేదు. నీలాచల్‌లో ఎంఎంటీసీ, ఎన్‌ఎండీసీ, భెల్‌తో పాటు మెకాన్‌లకు 93 శాతం వరకు వాటా ఉంది. ఒడిషాకు చెందిన రెండు రాష్ట్ర ప్రభుత్వ కంపెనీలకు కూడా స్వల్ప వాటా ఉంది. తమ వాటా అమ్మేసేందుకు ఒడిషా ఆమోదం తెలపడంతో ఆ కంపెనీల తరఫున కేంద్రం అమ్మేసింది. రూ. 12000 కోట్లకు అమ్మినా… ప్రమోటర్లే కంపెనీకి రూ. 4116 కోట్ల ఇవ్వాల్సి ఉంది. బ్యాంకులకు, ఉద్యోగులకు ఇవ్వాల్సింది కేవలం రూ. 1,741 కోట్లు మాత్రమే. నష్టాలు వస్తున్నాయని ఈ కంపెనీలో ఉత్పత్తి ఆపేశారు. ఇపుడు అమ్మేశారు.
2500 ఎకరాల భూమి
టాటా గ్రూప్‌కు కళింగనగర్‌లోనే 30 లక్షల టన్నులు స్టీల్ ప్లాంట్ ఉంది. దీనికి ఇపుడు నీలాచల్ నుంచి 11 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్లాంట్ చేతికి రానుంది. నీలాచల్ వద్ద ఏకంగా 2500 ఎకరాల భూమి ఉంది. వేలంలో దీన్ని కూడా ఇచ్చేస్తున్నారు. నీల్‌చాల్‌కు సొంత విద్యుత్ ప్లాంట్ ఉంది. అలాగే సొంత గనులు కూడా ఉన్నాయి. అలాగే ఆక్సిజన్, నైట్రోజన్, ఆర్గాన్ తయారీకి ప్రత్యేక ఎయిర్ సపరేషన్ ప్లాంట్ కూడా ఉంది. ఇవన్నీ ఇపుడు టాటాలకు వెళుతున్నాయి.