For Money

Business News

కొత్త సీఈఏ అనంత నాగేశ్వరన్‌

కొత్త ప్రధాన ఆర్థిక సలహాదారుగా (సీఈఏ)గా అనంత నాగేశ్వరన్‌ను ప్రభుత్వం నియమించింది. బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వే విడుదల చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నియామకం చేపట్టింది. గత ఏడాది డిసెంబరులో కేవీ సుబ్రమణియన్‌ మూడేళ్ల పదవీ కాలం పూర్తి కావటంతో ఈ పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. క్రెడిట్‌ సూయిస్‌ గ్రూప్‌ ఏజీ, జూలియస్‌ బేర్‌ గ్రూప్‌ మాజీ ఎగ్జిక్యూటివ్‌ అయిన నాగేశ్వరన్‌ నిన్న సీఈఏగా బాధ్యతలు చేపట్టినట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటనలో వెల్లడించింది. 2019 నుంచి 2021 వరకు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో పార్ట్‌టైమ్‌ సభ్యునిగా పనిచేశారు. అహ్మదాబాద్‌ ఐఐఎం నుంచి 1985లో మేనేజ్‌మెంట్ పీజీ డిప్లొమా చేసిన నాగేశ్వరన్‌ .. యూనివర్సిటీ ఆఫ్‌మసాచుసెట్స్‌ నుంచి 1994లో డాక్టోరల్ డిగ్రీ పొందారు. తక్షశిల ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటులో ఆయన సహ వ్యవస్థాపకునిగా ఉన్నారు.