వాల్స్ట్రీట్ను నిరాశపర్చిన టెస్లా
అమెరికా మార్కెట్లలో ఈక్విటీ మార్కెట్ల పతనం కొనసాగుతోంది. రాత్రి దాదాపు ఒక శాతంపైగా లాభంతో ప్రారంభమైన సూచీలు… క్లోజింగ్కల్లా భారీ నష్టాల్లో ముగిశాయి. నాస్డాక్ 1.54 శాతం. ఎస్ అండ్ పీ 500 సూచీ 0.52 శాతం, డౌజోన్స్ 0.02 శాతం నష్టంతో ముగిశాయి.కరోనా సమయంలో భారీ టర్నోవర్ సాధించిన ఐటీ, టెక్ షేర్లు ఇపుడు చేతులు ఎత్తేస్తున్నాయి. ఇపుడు ఫలితాలు బాగున్నా… మున్ముందు ఇదే స్థాయి లాభాలు ఉండవని హెచ్చరిస్తున్నాయి. మార్కెట్ ఆశించిన దానికన్నా చక్కటి ఫలితాలను టెస్లా ప్రకటించింది. అయితే చిప్ కొరతతోపాటు కొత్త వాహనాలను 2022లో తీసుకు రావడం లేదని కంపెనీ చెప్పడంతో షేర్ 11 శాతం క్షీణించింది. అలాగే ఇంటెల్ కూడా 7 శాతం క్షీణించింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్ షేర్లు కూడా నష్టాల్లో ముగిశాయి. యాపిల్ ఇవాళ ఫలితాలను ప్రకటించనుంది. ఈ కంపెనీ షేర్ లాభాలు కూడా కరిగి పోయి ఫ్లాట్గా ముగిసింది. డాలర్ మాత్రం దూసుకుపోతోంది. మొన్నటి దాకా 95 వద్ద ఉన్న డాలర్ ఇండెక్స్ 97ను దాటింది. ఇదే సమయంలో క్రూడ్ తగ్గకపోవడం ఆశ్చర్యకరం. ఇక బులియన్ భారీ నష్టాల తరవాత ఇపుడు కాస్త గ్రీన్లో ఉన్నాయి. బంగారం మళ్ళీ 1800 డాలర్ల దిగువకు వచ్చేసింది.