డాలర్‌తో బక్కచిక్కిన రూపాయి
విదేశీ మారక ద్రవ్య మార్కెట్ (ఫారెక్స్ మార్కెట్) డాలర్‌తో రూపాయి విలువ ఇవాళ భారీగా క్షీణించింది. డాలర్‌తో రూపాయి విలువ ఒక్క రోజే 41 పైసలు క్షీణించి 75.19కి పడిపోయింది. తాజాగా ఫ్యూచర్స్ మార్కెట్లో 75.21 వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు ఎన్ఎస్ఈలో యూఎస్డీ ఐఆర్ ఫిబ్రవరి కాంట్రాక్ట్ 75.1875 వద్ద ముగిసింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మార్చిలో పెంచడం ఖాయమని తేల్చడంతో అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లో డాలర్ బాగా బలపడింది. అమెరికాలో డాలర్ ఇండెక్స్ 0.70 శాతం లాభపడింది. షేర్ మార్కెట్లో విదేశీ నిధులు రాక తగ్గడంతోపాటు… విదేశీ ఇన్వెస్టర్ల అమ్మాలు జోరుగా ఉన్నాయి. మరోవైపు ముడి చమురు ధరలు కూడా భారీగా పెరగడంతో డాలర్‌కు డిమాండ్ పెరుగుతోంది.నెలాఖరులో ముడి చమురు కోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు డాలర్లు అధిక మోతాదులో కొంటారు. దీంతో డాలర్‌కు డిమాండ్ బాగా పెరిగింది.