For Money

Business News

చిన్న ఎలక్ట్రిక్‌ కారు ఇపుడే కాదు

25,000 డారల్లకే చిన్న ఎలక్ట్రిక్‌ కారు తెస్తానని టెస్లా ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇప్పట్లో తేవడం కష్టమని కంపెనీ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ వెల్లడించారు. డిసెంబర్‌తో ముగిసిన ఏడాదికి రాత్రి కంపెనీ ఫలితాలను ప్రకటించింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత ఏడాది కంపెనీ 550 కోట్ల డాలర్ల నికర లాభం ఆర్జించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది కంపెనీ ఉత్పత్తి 50 శాతం పెంచుతామని అన్నారు. అయితే చిప్‌ కొరత కారణంగా 2022లో కొత్త మోడల్స్‌ను తేవడం లేదని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాది సైబర్‌ట్రక్‌, కొత్త రోడస్టర్‌ను మార్కెట్‌లో తెస్తామని ఆయన హామి ఇచ్చారు. అత్యాధునిక బ్యాటరీ సెల్స్‌తో Y SUV మోడల్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభించినట్లు ఎలాన్‌ మస్క్‌ తెలిపారు.