మార్కెట్లో రూ. 275కే కరోనా టీకాలు
కరోనా టీకాలైన కోవిషీల్డ్ , కోవాగ్జిన్ ధరలు బాగా తగ్గే అవకాశం కన్పిస్తోంది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ ధరలు ఒక్కో డోస్ ధర రూ .275 అమ్మే చేసే అవకాశముంది. సర్వీస్ ఛార్జీ రూ.150 అదనంగా ఉండే అవకాశముంది. సాధారణ మార్కెట్లో వ్యాక్సిన్ల విక్రయానికి డ్రగ్ రెగ్యులేటర్ సంస్థ ఆమోదం కోసం ఈ రెండు వ్యాక్సిన్ కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. ప్రస్తుతం భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కోవాగ్జిన్ ప్రతి డోస్ ధర రూ. 1,200 కాగా, సీరం ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్‌ను ప్రైవేటు సంస్థలకు రూ.780లకు సరఫరా చేస్తోంది. రూ . 150 సర్వీస్ ఛార్జీ కూడా ఈ ధరలోనే కలిపి ఉంది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కోవిడ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఈ నెల 19న ఈ రెండు వ్యాక్సిన్లను ఓపెన్ మార్కెట్లో విక్రయించేందుకు సిఫారసు చేసింది.