For Money

Business News

భారీ లాభాల్లో దూసుకెళుతున్న యూరో

మరికొన్ని గంటల్లో అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ నిర్ణయం వెలువడనుండగా… యూరో మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఫెడ్‌ నిర్ణయాన్ని మార్కెట్‌ ఇప్పటికే డిస్కౌంట్‌ చేసిందని కొందరు అంటుండగా, అసలు మజా.. ఫెడ్‌ నిర్ణయాల తరవాత ఉంటుందని మరికొందరు అంటున్నారు. యూరోస్టాక్స్‌ 50 సూచీ ఏకంగా 2.4 శాతం లాభంతో ట్రేడవుతోంది. జర్మనీ డాక్స్‌ కూడా 2 శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా గ్రీన్‌లో ఉన్నాయి. దీంతో అమెరికా మార్కెట్లు కూడా లాభాల్లో ప్రారంభం కానున్నాయి. అయితే డాలర్‌తో పాటు క్రూడ్‌ ఆయిల్‌ పెరుగుతుండటం భారత్‌ వంటి వర్ధమాన మార్కెట్లకు ఆందోళన కల్గిస్తోంది. డాలర్‌ ఇండెక్స్‌ 96పైన ట్రేడవుతుండగా.. బ్రెంట్‌ క్రూడ్‌ 88 డాలర్లను దాటింది.