సిప్లా నికర లాభం రూ. 756 కోట్లు
డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో సిప్లా కంపెనీ మార్కెట్ అంచనాలను మించిన పనితీరు కనవర్చింది. ఈ మూడు నెలల్లో కంపెనీ రూ. 5479 కోట్ల టర్నోవర్‌పై రూ. 756 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. సీబీబీసీ టీవీ 18 సర్వేలో పాల్గొన్న నిపుణలు అంచనాకన్నా ఇవి ఎక్కువ. కంపెనీ మార్జిన్ కూడా 21.4 శాతం అంచనా వేయగా, కంపెనీ 22.5 శాతం సాధించింది. గత ఏడాదితో పోలిస్తే కంపెనీ టర్నోవర్ రూ. 5168 కోట్ల నుంచి రూ. 5479 కోట్లకు పెరగ్గా, నికర లాభం రూ. 728 కోట్ల నుంచి రూ. 729 కోట్లకు చేరింది. మార్జిన్ 23.8 శాతం నుంచి 22.4 శాతానికి తగ్గింది.