For Money

Business News

భువనగిరిలో ఏజీఐ గ్లాస్‌ప్యాక్‌ కొత్త ప్లాంట్‌

హెచ్‌ఎస్‌ఐఎల్‌ లిమిటెడ్‌ చెందిన ప్యాకేజింగ్‌ ప్రొడక్ట్స్‌ డివిజన్‌ ఏజీఐ గ్లాస్‌ప్యాక్‌… తెలంగాణలోని భువనగిరిలో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. స్పెషాలిటీ గ్లాస్‌ డివిజన్‌ కోసం రూ.400 కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన ఈ ప్లాంట్‌ ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించింది. బ్యూటీ ప్రొడక్ట్స్‌ ఉపయోగించే ప్రత్యేకమైన గ్లాస్‌ ఉత్పత్తులను ఈ ప్లాంట్‌లో కంపెనీ ఉత్పత్తి చేయనుంది. ఈ ప్లాంట్‌ ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 154 టన్నులు. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్న గ్లాస్‌ ఉత్పత్తులను ప్రధానంగా కాస్మోటిక్స్‌, ఫెర్‌ఫ్యూమ్స్‌, ఫార్మాస్యూటికల్స్‌ ఉత్పత్తులు, ప్రీమియం స్పిరిట్స్‌లో ఉపయోగిస్తారని కంపెనీ తెలిపింది. ఈ ప్లాంట్‌ ఏటా 10 శాతం వృద్ధితో రూ.250 కోట్ల ఆదాయాన్ని ఆర్జించవచ్చని అంచనా వేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. భువనగిరి ప్లాంట్‌ ద్వారా 350 మందికి పైగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.