For Money

Business News

నిఫ్టి 350 పాయింట్లు డౌన్‌

ఫెడ్‌ సమావేశాలు, ఉక్రెయిన్‌ యుద్ధ భయాల కారణంగా మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. పైగా ఈసారి బడ్జెట్‌పై మార్కెట్‌లో పెద్దగా ఆశలు లేకపోవడంతో అన్ని వైపులా అమ్మకాల ఒత్తిడి వస్తోంది.చాలా మంది ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరిస్తున్నారు. నాలుగు షేర్లు మినహా నిఫ్టి షేర్లన్నీ భారీ నష్టాల్లో ఉన్నాయి. ముఖ్యంగా నిఫ్టి టెక్నికల్‌ సపోర్ట్‌లను చాలా ఈజీగా కోల్పోవడంతో… అనేక బ్రోకింగ్‌ సంస్థలు ఎక్కడా కొనుగోలుకు సలహాలు ఇవ్వడం లేదు. ఇంకా పెరిగితే అమ్మమనే అంటున్నాయి. పైగా విదేశీ ఇన్వెస్టర్లు క్రమంగా తప్పకుండా అమ్ముతున్నారు. ఈ వారంలో రిపబ్లిక్ డే సెలవుతో పాటు గురువారం వీక్లీ డెరివేటిక్స్‌ క్లోజింగ్‌ ఉంది. దీంతో సూచీలపై ఒత్తిడి తీవ్రంగా ఉంది. పెద్ద ఇన్వెస్టర్లు ఆప్షన్స్‌లో నిఫ్టి భారీ స్థాయిలో అమ్మేశారు. ఇపుడువారు అనుకున్న స్థాయికి నిఫ్టిని తీసుకెళుతున్నారు. అమ్మకాల ఒత్తిడి, భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు బయటపడుతున్నారు. నిఫ్టి 400 పాయింట్లకుపైగా నష్టంతో 17210 స్థాయిని తాకింది.