NIFTY TRADE: 17450 కీలకం
రిలయన్స్ అద్భుత పనితీరు, ఐసీఐసీఐ బ్యాంక్ ఆకర్షణీయ ఫలితాల నేపథ్యంలో … పలు ప్రతికూల పరిస్థితుల్లో నిఫ్టి ఇవాళ ప్రారంభం కానుంది. నిఫ్టి నష్టాలు ఏమాత్రం ఉంటాయో చూడాలి. ఎందుకంటే సింగపూర్ నిఫ్టి 150 పాయింట్ల నష్టంలో ఉన్నా… నిఫ్టి అదే స్థాయి నష్టాల్లో ప్రారంబమౌతుందా లేదా తక్కువ నష్టంతో ఓపెన్ అవుతుందా అన్నది కీలకం. ఎందుకంటే నిఫ్టి క్రితం ముగింపు 17,617. నిఫ్టికి 17525 వద్ద గట్టి మద్దతు ఉంది. ఈ స్థాయిలో నిఫ్టికి మద్దతు అందుతుందేమో చూడాలి. ఈ స్థాయికి దిగువన 17495, 17450 తదుపరి మద్దతు స్థాయిలు. అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లో ఉన్నందున నిఫ్టికి మద్దతుకు ఛాన్స్ ఉంది. అలాగే బుధవారం మార్కెట్‌కు సెలవు కావడంతో…ఇవాళ, రేపు డెరివేటివ్స్‌లో ట్రేడింగ్ చాలా కీలకం కానుంది. డే ట్రేడర్స్‌కు కీలక లెవల్స్ ఇవి…
17620 కీలకం
తొలి మద్దతు 17525
రెండో మద్దతు 17495
డౌన్ బ్రేకౌట్ 17450